: ధ్రువీకరించని సిమ్ లను బ్లాక్ చేసేస్తోన్న రిలయన్స్‌ జియో


ఉచిత మంత్రంతో టెలికాం మార్కెట్‌లోకి వ‌చ్చి ఎవ్వ‌రూ ఊహించ‌నంత‌గా రిల‌య‌న్స్‌ జియో వినియోగ‌దారుల‌ను సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. సిమ్ కార్డులు తీసుకున్న వెంట‌నే యాక్టివేట్ చేసేయ‌డం కూడా వినియోగ‌దారుల‌ను అధికంగా ఆక‌ర్షించింది. అయితే, ధ్రువీకరించని రిలయన్స్‌ జియో కార్డులను బ్లాక్‌ చేసేందుకు ఆ సంస్థ స‌న్నాహాలు చేసుకుంటోంది. సిమ్‌ కార్డుల‌ను యూజర్లకు అందించే సమయంలో ఆధార్‌ కార్డును స‌మ‌ర్పించిన‌ప్ప‌టికీ వెరిఫికేషన్‌ ప్రక్రియలో నాన్‌ వెరిఫైడ్ అయిన వాటిని బ్లాక్ చేయ‌నుంది. దానితో పాటు ఇ-కేవైసీ సమర్పించని ఖాతాదారులకు కూడా జియో ఎస్‌ఎంఎస్‌లు పంపిస్తూ హెచ్చరిస్తోంది. జియో సిమ్‌  ద్వారా 1977 నెంబర్‌ కు కాల్‌ చేసి, టెలీ వెరిఫికేషన్‌ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని త‌మ యూజ‌ర్ల‌కు సూచిస్తోంది. ఆధార్‌ కార్డుతో జియో సిమ్‌ తీసుకున్నవారికి మాత్రం ఎలాంటి సమస్య ఉండదని చెబుతోంది. ఈ నెల 1 నుంచే ఈ ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది.

  • Loading...

More Telugu News