: ‘హ్యాపీ విషు’ అంటూ ట్వీట్ చేసిన నటుడు మోహన్‌లాల్
ఈ రోజు మలయాళీల కొత్త సంవత్సరాది. కొత్త సంవత్సరాదిని వారు ‘విషు’ అని అంటారు. ఈ సందర్భంగా ప్రముఖ దక్షిణాది నటుడు మోహన్‌లాల్ ‘హ్యాపీ విషు’ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ తో పాటు, వైట్ అండ్ వైట్ డ్రెస్సు ధరించి దేవుడి వద్ద కూర్చుని ఉన్న తన ఫొటోను మోహన్‌లాల్ పోస్టు చేశారు. కాగా, మలయాళ నటుడు మమ్ముట్టి, జయరాం, దిలీప్, ఉన్ని కృష్ణన్ తదితరులు తమ ఫేస్ బుక్ ఖాతా ద్వారా ‘విషు’ శుభాకాంక్షలు తెలిపారు.
ఇక ఈ పండగ గురించి చెప్పాలంటే.. పండగ ముందురోజు రాత్రి దేవాలయాలకు వెళ్లి, అక్కడే పడుకుని, తెల్లవారుజామున మూడుగంటలకు నిద్రలేచి, మొట్టమొదట దేవుడినే చూస్తారు. కొత్త ఏడాదిలో మొదట దేవుడిని దర్శించుకోవడం మలయాళీల ఆనవాయతి. ఈ విధంగా దేవుడిని చూసే వేడుకను ‘విషుకని’ అంటారు. ఇదిలా ఉండగా, హైదరాబాద్ లో నివసిస్తున్న మలయాళీ కుటుంబాల వారు ‘విషు’ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు.