: ఇక గొప్పవారి పుట్టిన రోజున సెలవుండదు: యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం


ఇప్పటికే పాలనలో తనదైన శైలిలో దూసుకెళ్తున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఈసారి పెను సంచలన నిర్ణయం తీసుకున్నారు. మహనీయుల జయంతి సందర్భంగా సెలవులను ప్రకటించడాన్ని రద్దు చేస్తున్నట్టు తెలిపారు. గొప్పవారి ఘనతను విద్యార్థులకు పరిచయం చేయాల్సిన రోజున సెలవు తీసుకోవడం సరికాదని అభిప్రాయపడ్డ ఆయన, ఇకపై మహనీయుల పుట్టిన రోజుల నాడు పాఠశాలలకు సెలవులు ఉండవని తెలిపారు. బీఆర్ అంబేద్కర్ 126వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన, ప్రసంగిస్తూ, అబ్దుల్ కలాం కన్నుమూసినప్పుడు విద్యాసంస్థలకు సెలవు ఇస్తే, విమర్శలు చెలరేగిన విషయాన్ని గుర్తు చేశారు. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని మరింతగా కష్టపడాలని అన్నారు. ఇప్పుడు యూపీ సీఎం తీసుకున్న ఈ సంచలన నిర్ణయాన్ని పలువురు నెటిజన్లు స్వాగతిస్తున్నారు.

  • Loading...

More Telugu News