: అమెరికా దాడిలో 40 మంది ఉగ్రవాదుల హతం!


ఆఫ్ఘనిస్థాన్ లోని నాన్ గర్హర్ ప్రావిన్స్ లోని ఉగ్రవాద శిబిరంపై మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ గా పిలుచుకునే 21,000 పౌండ్ల బరువైన జీబియూ 40 బాంబును ఎంసీ 130 విమానం నుంచి జారవిడిచి ఐసీస్ ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో బంకర్లలో తలదాచుకున్న 40 మంది ఉగ్రవాదులు మరణించినట్టు తెలుస్తోంది. నాన్ గర్హర్ ప్రావిన్స్ లో భారీ ఎత్తున ఉగ్రవాదులు స్థిరమైన బంకర్లు ఏర్పాటు చేసుకుని జీవనం ఉంటున్నారని తెలుస్తోంది.

వీరి బంకర్లను నాశనం చేయడమే లక్ష్యంగా అమెరికా దాడి జరిగింది. ఈ దాడిని ఆఫ్ఘాన్ ప్రభుత్వం ఖండించింది. అమెరికా దాడిపై తమకు సమాచారం లేదని చెబుతోంది. కాగా, తీవ్రవాదులతో అట్టుడుకుతున్న దేశాల్లో ఆప్ఘనిస్థాన్ కూడా ఒకటి. ఉగ్రవాదానికి మతోన్మాదం కూడా తోడు కావడంతో...మత పెద్దల నుంచి ఎలాంటి వ్యతిరేకత రాకుండా ముందు జాగ్రత్తగా ఆఫ్ఘనిస్థాన్ ఈ ప్రకటన చేసింది. మరణించిన ఉగ్రవాదుల్లో కేరళ నుంచి ఐఎస్ఐఎస్ లో చేరేందుకు పరారైన 21 మంది యువకుల్లో ఒకరు ఉన్నట్టు ఆఫ్ఘన్ ప్రభుత్వం సమాచారం అందించింది. 

  • Loading...

More Telugu News