: పోలీసులు ఇంకా స్పందించకపోతే... మేము కూడా ఆత్మహత్య చేసుకుంటాము: స్వాతి తండ్రి
వెంటనే పోలీసులు స్పందించకపోతే తాము కూడా ఆత్మహత్యకు పాల్పడతామని అమెరికాలో ఆత్మహత్యకు పాల్పడిన మధుకర్ రెడ్డి భార్య స్వాతి, ఆమె తండ్రి తెలిపారు. ఆత్మహత్య చేసుకునేందుకు స్వాతి పెద్ద మొత్తంలో హార్పిక్ తాగిందని వైద్యులు తెలిపారు. ఆమె అన్నవాహిక బాగా దెబ్బతిందని వారు తెలిపారు. ఇంటర్నల్ బ్లీడింగ్ అయితే ఆమెను కాపాడడం కష్టమని వారు అభిప్రాయపడ్డారు.
కాగా, గత రాత్రి స్వాతి అంతు చూస్తామంటూ, ఆమె ఎలా బతుకుతుందో చూస్తామంటూ బెదిరింపులు వచ్చాయని, అంతే కాకుండా ఆమె కేరక్టర్ ను కించపరుస్తూ ఆమె అత్తింటివారు పుకార్లు పుట్టిస్తున్నారని స్వాతి తండ్రి వాపోయారు. మధుకర్ రెడ్డి బంధువు రవీందర్ రెడ్డి నుంచి తమకు ప్రాణహాని ఉందని... మధుకర్ రెడ్డి అంత్యక్రియల రోజున తమపై దాడి చేసింది రవీంద్ర రెడ్డేనని ఆయన తెలిపారు. పోలీసులు ఆయనపై ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఆ ధైర్యంతోనే ఆయన తమ జీవితాలతో ఆడుకుంటున్నాడని వారు తెలిపారు. ఇప్పటికైనా పోలీసులు తమకు రక్షణ ఇవ్వకపోతే తమ అందరికీ సామూహిక ఆత్మహత్యే శరణ్యమని ఆయన స్పష్టం చేశారు.