: ఎస్సీలను ఇంత మోసం చేస్తారా?: టీడీపీ ఎంపీ శివప్రసాద్ కీలక వ్యాఖ్యలు
ఇటీవలి మంత్రివర్గ విస్తరణలో ఎస్సీలకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఎస్సీలను అన్ని రకాలుగా మోసం చేస్తున్నారని చిత్తూరు పార్లమెంట్ సభ్యుడు, తెలుగుదేశం నేత శివప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అడుగడుగునా ఎస్సీలకు అన్యాయం జరుగుతోందని, అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తరువాత పలువురిలో తీవ్ర అసంతృప్తి నెలకొని వుందని తెలిపారు. దళితుల అభ్యున్నతికి మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను చేపట్టాల్సి వుందని సూచించారు.