: ధోనీ ఫామ్ గురించి దిగులు అక్కర్లేదు!: వెనకేసుకొచ్చిన స్టీవ్ స్మిత్
ఐపీఎల్-10లో స్టార్ క్రికెటర్ ధోనీ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. దీంతో, అతని ఆటతీరుపై నలువైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్రికెట్ దిగ్గజం సౌరభ్ గంగూలీ అయితే ఏకంగా టీ20లకు ధోనీ పనికిరాడంటూ కామెంట్ చేశాడు. ఈ నేపథ్యంలో, ధోనీని రైజింగ్ పూణె సూపర్ జెయింట్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ వెనకేసుకొచ్చాడు. ధోనీ ఫామ్ గురించి తమకు ఎలాంటి దిగులు లేదని స్మిత్ చెప్పాడు. తమ జట్టు కేవలం మూడు మ్యాచ్ లే ఆడిందని... మిగతా మ్యాచ్ లలో ధోనీ పుంజుకుంటాడని చెప్పాడు. ధోనీ ఓ అద్భుతమైన ఆటగాడని కితాబిచ్చాడు. పూణె జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ధోనీ మూడు మ్యాచ్ లకు గాను కేవలం 28 పరుగులు మాత్రమే చేసి, నిరాశ పరిచాడు. కెప్టెన్సీ నుంచి తొలగించడం వల్లే ధోనీ అలా ఆడుతున్నాడంటూ మరోపక్క విమర్శలు కూడా వస్తున్నాయి.