: గంభీర్, సెహ్వాగ్ మీరు అలా చేయవద్దు: పీడీపీ నేత నీతులు


సైనికులపై కశ్మీరీ వేర్పాటు వాద యువకులు దాడులు చేసిన ప్రతిసారీ టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ దూకుడుగా స్పందిస్తారన్న సంగతి తెలిసిందే. దీనిపై జమ్మూ-కశ్మీర్ లోని పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ (పీడీపీ) వీరూ, గౌతీకి నీతులు చెబుతోంది. సీఆర్పీఎఫ్ జవానుపై దాడి చేసిన యువకులపై ఎలాంటి చర్యలు తీసుకోని పీడీపీ నేత వహీద్ రహమాన్ మాట్లాడుతూ, అసమంజసమైన స్టేట్‌ మెంట్లు ఇవ్వడం కన్నా లోయలోని యువతలో పరివర్తన తెచ్చేందుకు కృషి చేయాలని సెహ్వాగ్, గంభీర్ కు సూచించారు.

సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, సచిన్ టెండూల్కర్ వంటి క్రికెటర్లు సమంజసమైన స్టేట్‌మెంట్లు ఇస్తే యువత మనసుపై ప్రభావం ఉంటుందని ఆయన చెప్పారు. యువతను సమైక్యపరచడంలో ఇటువంటి స్టార్స్ భావోద్వేగపరంగా తమకు సాయపడతారని ఆయన తెలిపారు. క్రీడాస్ఫూర్తి, టీమ్ స్పిరిట్‌ ను అభివృద్ధి చేసేందుకు కశ్మీర్ వచ్చి, భావోద్వేగమైన పిలుపునివ్వాలని ఆయన సూచించారు. అంతేకానీ, కశ్మీరు యువతను చంపాలని, దూరం చేయాలని పిలుపునివ్వరాదని ఆయన సూచించారు. 

  • Loading...

More Telugu News