: పవన్ కల్యాణ్ గారూ! ప్రత్యేకహోదా క్లోజ్డ్ ఛాప్టర్... ప్రజల సమయం వేస్టు చేయకండి!: బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు
ప్రత్యేకహోదా కోసం పవన్ కల్యాణ్ ఉద్యమం చేస్తాననడం హాస్యాస్పదమని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. వైజాగ్ లో ఆయన మాట్లాడుతూ, ప్రత్యేకహోదా ఈజ్ క్లోజ్డ్ ఛాప్టర్ అని అన్నారు. ప్రత్యేక హోదా మీద ఎవరైనా ఉద్యమం చేస్తామంటే... మళ్లీ సమైక్యాంధ్రపై ఉద్యమం చేసినట్టు ఉంటుందని ఆయన ఎద్దేవా చేశారు. ప్రత్యేకహోదా పేరు చెప్పి, ప్రజల సమయం వృథా చేయవద్దని ఆయన సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చుతోందని, హోదా కంటే ఎక్కువ సౌకర్యాలు కల్పించే ప్రయత్నంలో ఉందని ఆయన తెలిపారు.