: అమెరికా బాంబు దాడిలో కేరళ ఉగ్రవాది మృతి


కేరళలో మాయమై, ఆపై ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల్లో చేరిపోయాడని భావిస్తున్న కేరళకు చెందిన యువకుడు, నిన్న అమెరికా జరిపిన జీబీయూ - 43 బాంబు దాడిలో మరణించినట్టు తెలుస్తోంది. ఆఫ్గన్ లోని నన్గాన్హర్ ప్రావిన్స్ పరిధిలోని అచిన్ జిల్లాపై ఈ మెగా బాంబ్ స్ట్రయిక్ జరుగగా, కేరళ నుంచి పారిపోయిన 21 మందిలో ఒకడైన ముర్షీద్ కూడా మృతిచెందాడు. ముర్షీద్ మరణించిన విషయాన్ని ఆయన కుటుంబానికి ఆఫ్గన్ అధికారులు తెలియజేస్తూ, టెలిగ్రామ్ ను పంపారు. కాగా, ఈ సంవత్సరం ఫిబ్రవరిలో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో కేరళలోని కసార్ గోడ్ ప్రాంతానికి చెందిన హఫీసుద్దీన్ తేకే మరణించినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News