: రేపట్నుంచి సముద్రంలో చేపల వేట బంద్.. ఎక్కడికక్కడే నిలిచిపోనున్న పడవలు


ఏపీ సముద్ర తీరంలో ఈ నెల 15వ తేదీ నుంచి చేపల వేట ఆగిపోనుంది. ఆదివారం నుంచి మరపడవలు ఎక్కడికక్కడే నిలిచిపోనున్నాయి. జూన్ 15వ తేదీ వరకు చేపల వేటపై నిషేధం అమల్లో ఉంటుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. సముద్రంలో చేపల సంతతిని పెంచే క్రమంలో ఈ నిర్ణయాన్ని కొన్నేళ్లుగా అమలు చేస్తున్నారు. గతంలో ఏప్రిల్ 15వ తేదీ నుంచి మే 15 వరకే నిషేధం విధించేవారు. గత రెండేళ్ల నుంచి ఈ నిషేధాన్ని రెండు నెలలకు పెంచారు. మరోవైపు, చేపల వేటపై నిషేధం నేపథ్యంలో, మత్స్యకారులు రెండు నెలల పాటు తమ ఉపాధిని కోల్పోనున్నారు. దీంతో, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ఈ రెండు నెలల పాటు తమకు ఉపాధి కల్పించాలని వారు కోరుతున్నారు. 

  • Loading...

More Telugu News