: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అగ్నిప్రమాదం... ఆర్పుతున్న నాలుగు ఫైరింజన్లు
హైదరాబాదులోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అజంతా గేట్ వద్ద మంటలు చెలరేగాయి. ఈ మంటలు క్షణాల్లోనే దగ్గర్లోని గుడిసెలకు అంటుకోవడంతో భారీ ఎత్తున గుడిసెలు దగ్ధమయ్యాయి. దీంతో నాలుగు ఫైరింజన్లు రంగంలోకి దిగాయి. అయితే గంటసేపట్నుంచి ఫైరింజన్లు శ్రమిస్తున్నా.... మంటలు అదుపులోకి రావడం లేదు.