: అధినేత జగన్ ముందే బాహాబాహీకి దిగిన వైకాపా నేతలు!


వైకాపా అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన పులివెందులలో ప్రజాదర్బార్ ను నిర్వహించిన వేళ, చిన్నకుడాలకు చెందిన పార్టీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటూ బాహాబాహీకి దిగారు. తమ గ్రామానికి మంచి నీటిని సరఫరా చేయకుండా పక్కనున్న రామన్నూతల పల్లెకు నీటిని ఎందుకు ఇస్తున్నారని సర్పంచ్ నాగేంద్ర రెడ్డిని, మాజీ సర్పంచ్ శివ శంకర్ రెడ్డి ప్రశ్నించడంతో వివాదం మొదలైంది. ఎంపీడీఓపైనా శివశంకర్ రెడ్డి విరుచుకుపడ్డారు. వీరికి సర్దిచెప్పే ప్రయత్నం చేసిన జగన్, సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరారు.  

  • Loading...

More Telugu News