: తెలంగాణలో మోదీ భార్య జెశోదా బెన్... నాగదేవతకు పూజలు


ప్రధాని నరేంద్ర మోదీ సతీమణి జేశోదా బెన్ తెలంగాణలో పర్యటించారు. నిన్న రాష్ట్రానికి వచ్చిన ఆమె, వికారాబాద్ జిల్లాలోని నాగదేవత ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆపై ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. వచ్చిన మహిళ ప్రధాని భార్య అని తెలుసుకున్న స్థానికులు పెద్దఎత్తున ఆమెను చూసేందుకు వచ్చారు. దీంతో స్థానిక పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. కాగా, నరేంద్ర మోదీ, జెశోదా బెన్ లకు చిన్న వయసులోనే వివాహం కాగా, కొంతకాలం తరువాతి నుంచి వారిద్దరూ విడివిడిగానే జీవిస్తూ ఉన్నారన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News