: మొన్న చెన్నై... నేడు విజయవాడలో కుంగిన రోడ్డు


రెండు రోజుల క్రితం చెన్నైలో రద్దీగా ఉన్న రోడ్డు ఒక్కసారిగా భూమిలోకి కుంగిపోయి, బస్సు, కారు ఆ గుంతలో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. తాజాగా విజయవాడలోని వన్ టౌన్ లోని చేపల మార్కెట్ దగ్గర అచ్చం అలాగే రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. ఈ రోడ్డును పుష్కరాల సమయంలోనే వేయడం విశేషం. దీనిని చూసిన స్థానికులు అధికారులకు ఫోన్ చేసి, వారిని అప్రమత్తం చేయడంతో ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదు. అయితే కాంట్రాక్టరు అలసత్వం వల్లే రోడ్డు ఇలా కుంగిపోయిందని, నాణ్యతలేని పనులు చేసిన రోడ్డు కాంట్రాక్టరును శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు. 

  • Loading...

More Telugu News