: చిరంజీవి వంటి అన్న నాకుంటేనా..?: రాంగోపాల్ వర్మ
మెగాస్టార్ చిరంజీవి కుటుంబంపై తాను చేసిన వ్యాఖ్యల తరువాత ఏర్పడిన వివాదాన్ని తగ్గించాలని భావించాడో ఏమో, వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ క్షమాపణలు చెప్పాడు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ పెడుతూ, 'చిరంజీవి లాంటి అన్నయ్య నాకుంటే నేను మాట్లాడిన మాటలకి కొట్టేవాడిని. నాగబాబు మాటలతోనే వదిలేశారు. రియల్లీ సారీ టూ హిమ్ (ఆయనకు నిజంగా క్షమాపణలు)' అని అన్నాడు.
కాగా, 'ఖైదీ నంబర్ 150' ప్రీ రిలీజ్ వేడుకలో రాంగోపాల్ వర్మపై చిరంజీవి సోదరుడు నాగబాబు తీవ్రంగా విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. ఆపై వర్మ సైతం నాగబాబును టార్గెట్ చేస్తూ పలు ట్వీట్లు వదిలారు. తాజాగా వర్మ క్షమాపణలతో ఆ వివాదం సద్దుమణిగిందనే భావించాలేమో!
chiranjeevigaari laanti annayya naakunte nenu matladina maatalaki kottevaadini .naga babu gaaru maataltho vadilesaru ..real sorry to him
— Ram Gopal Varma (@RGVzoomin) 14 April 2017