: తమిళ మంత్రులు కామరాజ్, రాధాకృష్ణన్‌లపై కేసు?.. ఐటీ అధికారిని బెదిరించినట్టు ఆరోపణలు!


తమిళ మంత్రులు కామరాజ్, రాధాకృష్ణన్‌లపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. వైద్యశాఖామంత్రి విజయభాస్కర్ ఇంటిలో ఐటీ అధికారులు దాడులు చేస్తున్న సమయంలో మంత్రులిద్దరితోపాటు ఢిల్లీలోని తమిళ ప్రభుత్వ ప్రతినిధి అయిన దళవాయి సుందరం కలసి మహిళా ఐటీ అధికారిని బెదిరించినట్టు ఆరోపణలున్నాయి. ఈ మేరకు బుధవారం చెన్నై పోలీస్ కమిషనర్‌కు ఐటీ అధికారులు ఫిర్యాదు చేశారు.

దీంతో వారిపై కేసుల నమోదుకు న్యాయనిపుణుల సలహాలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. బెదిరింపు ఆరోపణల నిగ్గు తేల్చేందుకు అదనపు పోలీస్ కమిషనర్ శంకర్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఆర్కేనగర్ ఉప ఎన్నిక సందర్భంగా ఓటర్లను మభ్యపెట్టేందుకు మంత్రి విజయభాస్కర్ ఇంటి నుంచే నగదు వెళ్లినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఈ నెల 7న అధికార పార్టీ నేతలు, మద్దతుదారులే లక్ష్యంగా ఐటీ అధికారులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News