: ఏళ్ల క్రితమే సమాధి నిర్మాణం.. వారం క్రితం ఆత్మహత్యకు ప్లాన్.. మంగళవారం సూసైడ్!


పక్కా ప్లానింగ్.. అనగా వినే ఉంటాం. కానీ 72 ఏళ్ల ఆయుర్వేద వైద్యుడు దానిని అంతే పక్కాగా అమలు చేశాడు. ఏళ్ల క్రితమే తన కోసం సమాధిని నిర్మించుకుని, వారం క్రితం ఆత్మహత్యకు ప్రణాళిక రచించి, మంగళవారం ప్రాణాలు తీసుకున్నాడు. కేరళలో జరిగిందీ ఘటన. ఇడుక్కి జిల్లా అడిమలైకి చెందిన కేజే జోసెఫ్ కోనూర్ ఆయుర్వేద వైద్యుడు. అతడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

తన ఇంటికి సమీపంలో 2006లో తనకోసం సమాధిని నిర్మించుకున్నారు. వారం రోజుల క్రితం ఆత్మహత్యకు ప్లాన్ చేసుకున్నారు. అందులో భాగంగా మంగళవారం తన ఇంటికి రావాల్సిందిగా గతవారమే స్నేహితులను ఆహ్వానించారు. గతంలోనే నిర్మించుకున్న సమాధిని శుభ్రం చేయించారు. అనంతరం సూసైడ్ నోట్ రాశారు. తన అంత్యక్రియలను ఏ మతాచారం ప్రకారం నిర్వహించవద్దని, హంగు, ఆర్భాటాలు అసలే వద్దని నోట్‌లో పేర్కొన్నారు. ముందుగా అనుకున్న ప్రకారం మంగళవారం ఆత్మహత్య చేసుకున్నారు.

  • Loading...

More Telugu News