: రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన కేటీఆర్


హైదరాబాదులోని తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయం వద్ద గత అర్థరాత్రి చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం బాధితులకు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పరిహారం ప్రకటించారు. మద్యం మత్తులో ఉన్న చెత్తట్రాలర్ ను తరలిస్తున్న డ్రైవర్ అతి వేగంగా వచ్చి ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆజర్‌, అమన్‌, అశ్వియా, అలీనా మృతి చెందగా, ఇమ్రానా బేగం, మరో వ్యక్తి తీవ్రగాయాలపాలయ్యారు. అదే సమయంలో ఆర్మూల్ లో అధికారిక కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తున్న మంత్రి కేటీఆర్ క్షతగాత్రులను యశోదా ఆసుపత్రికి తన కాన్వాయ్ వాహనంలో తరలించారు. అనంతరం ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించి, భాధితుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారం అందజేయనున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News