: భువనగిరి సమీపంలో భారీ అగ్నిప్రమాదం
యాదాద్రి జిల్లా భువనగిరి సమీపంలో ఓ ఆయిల్ కంపెనీలో అగ్నిప్రమాదం సంభవించింది. ఓ బోల్టు లూజైన కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని కంపెనీ సిబ్బంది చెబుతుండగా, అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. తెల్లవారు జాము నుంచి రెండు ఫైర్ ఇంజన్లు మంటలు అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నా ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదు. భారీ ఎత్తున మంటలు, పొగ గాల్లోకి లేచి పడుతుండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మంటలు ఆరిన తరువాత ప్రమాదానికి కారణాలు తెలిసే అవకాశం ఉందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.