: సంపూర్ణేష్ బాబు అంటే నాకు చాలా ఇష్టం.. తప్పకుండా అతనితో పనిచేస్తా!: పూరీ జగన్నాథ్
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు అంటే తనకు ఎంతో ఇష్టమని, అతనితో కలిసి పని చేయాలని చాలాసార్లు అనుకున్నానని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ అన్నారు. సంపూర్ణేష్ బాబుహీరోగా నటించిన ‘కొబ్బరిమట్ట’ చిత్రంలోని ‘శంభో శివ శంభో’ పాటను పూరీ జగన్నాథ్ విడుదల చేశారు. అనంతరం, ఆయన మాట్లాడుతూ, ‘ఈ చిత్రం టైటిల్ చాలా ఆసక్తిగా ఉంది. ‘శంభో శివ శంభో’ పాట చూశాను.. మాటలు లేవు.. ఓన్లీ చూడటాలే.. సంపూర్ణేష్ బాబుతో కలిసి పనిచేయాలని చాలాసార్లు అనుకున్నప్పటికీ కుదర్లేదు. భవిష్యతులో తప్పకుండా అతనితో పని చేస్తాను’ అని అన్నారు.