: ‘రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు’ ప్రదర్శనకు ఉంచిన బ్యాట్లు, బాల్ చోరీ!
ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరపున ఇంత వరకూ ఎందరో స్టార్ క్రికెటర్లు ఆడారు. వారిలో రాహుల్ ద్రవిడ్, యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్ వంటి వారు ఉన్నారు. అయితే, ఐపీఎల్ మ్యాచ్ లలో ఆయా క్రికెటర్లు ఉపయోగించిన బ్యాట్లు, బాల్స్ ను బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలోని ఓ అంతస్తులో రెండు రోజుల క్రితం ప్రదర్శనకు ఉంచారు. అయితే, రేపు జరగబోయే మ్యాచ్ కు స్టేడియాన్ని సిద్ధం చేస్తున్న తరుణంలో రెండు బ్యాట్లు, ఓ బాల్ చోరీకి గురైన విషయం వెలుగు చూసింది. అక్కడ పనిచేసే వారే ఈ పనికి పాల్పడి ఉంటారని నిర్వాహకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.