: ఈ అంకిత భావమే ప్రభాస్ ను టాప్ హీరోగా నిలబెడుతుంది: దర్శకుడు రాజమౌళి
‘బాహుబలి’ సినిమా కోసం హీరో ప్రభాస్ కనబరిచిన అంకిత భావాన్ని నిజంగా మెచ్చుకోవాలని, ఈ అంకిత భావమే ప్రభాస్ ను చిత్ర పరిశ్రమలో టాప్ హీరోగా నిలబెడుతుందని దర్శకుడు రాజమౌళి ప్రశంసించారు. ప్రభాస్ వల్లే ‘బాహుబలి’ సాధ్యమైందని, మొత్తం మూడున్నరేళ్లు ఈ చిత్రం కోసం ప్రభాస్ కేటాయించాడని అన్నారు. తన కన్నా బాహుబలి సినిమా చాలా ఎక్కువ అని, ఆ సినిమా కన్నా ‘బాహుబలి’ ఫ్రాంచైజీ ఇంకా పెద్దదని అన్నారు. కాగా,‘బాహుబలి-2’ ఐ మ్యాక్స్ వెర్షన్ కు సంబంధించిన పోస్టర్ ను ముంబయిలో నిన్న ఆయన విడుదల చేశారు. ఈ నెల 28న ‘బాహుబలి-2’ ప్రేక్షకుల ముందుకు రానుంది.