: హైదరాబాద్ లో 9999 ఫ్యాన్సీ నెంబర్‌ ఏకంగా రూ.10 లక్షలకు అమ్ముడుపోయింది!


తెలంగాణ ర‌వాణాశాఖ‌ ఈ రోజు హైదరాబాద్ లో వాహ‌న‌ ప్యాన్సీ నెంబ‌ర్ల‌కి సంబంధించి వేసిన వేలంలో 9999 నెంబరు ఏకంగా రూ.10 లక్షలు పలికింది. పూర్తి నెంబ‌రు టీఎస్‌ 09 ఈఎస్‌ 9999 అయిన దీన్ని హెట్రో డ్రగ్స్‌ ప్రతినిధులు ఆ ధరకు వేలం పాడి సొంతం చేసుకున్నారు. ఆ కంపెనీకి చెందిన‌ రూ. 6.85 కోట్ల విలువైన బెంట్లీ ముల్సానే బ్రాండు కారుకు ఈ నెంబరు తీసుకున్నారు. ఇదే వేలం పాట‌లో ఉంచిన‌ మ‌రిన్ని నెంబ‌ర్లు కూడా అధిక ధ‌ర ప‌లికాయి. టీఎస్‌ 09 ఈఎస్‌ 0099 నెంబరును సుశీ ఇన్‌ఫ్రా అండ్‌ మైనింగ్‌ లిమిటెడ్ ప్ర‌తినిధులు రూ.1.93 లక్షలకు ద‌క్కించుకున్నారు. రూ. 4.49 కోట్ల ఫెరారీ 488 జీటీబీ మోడల్‌కు ఈ నంబర్ ఉప‌యోగించ‌నున్నారు.

ఆ త‌రువాత టీఎస్‌ 09 ఈఎస్‌ 0009 నంబరును ఇంటర్‌ కాంటినెంటల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ సంస్థ రూ.1.73 లక్షలకు తీసుకుంది. త‌మ రూ. 20 లక్షలతో తీసుకున్న ఇన్నోవా క్రిస్టా కారుకు ఈ నంబరును తీసుకున్నారు. టీఎస్‌ 09 ఈఎటీ 0007 నంబరును గాయత్రి ప్రాజెక్ట్స్ సంస్థ రూ. 1.15 లక్షలకు పొందింది. ఈ నెంబ‌రును రూ.1.28 కోట్లతో కొన్న బెంజ్‌ ఎస్‌350 సీడీఐ కారుకు వినియోగించ‌నున్నారు.

  • Loading...

More Telugu News