: ఇంటర్ మీడియట్ టాపర్లకు ఫోన్ చేసి అభినందించిన చంద్రబాబు
ఏపీ ఇంటర్ మీడియట్ సెకండ్ ఇయర్ ఫలితాలు ఈ రోజు వెలువడిన విషయం తెలిసిందే. ఎంపీసీ, బైపీసీలో ప్రథమ స్థానాల్లో నిలిచిన షేక్ షర్మిల, ఆలపాటి నైమిషలను ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు అభినందించారు. వారికి ఫోన్ చేసి మాట్లాడారు. కార్డియాలజిస్టు కావాలన్న తన అభిలాషను చంద్రబాబుకు నైమిష తెలిపింది. ఉన్నత చదువులకు ఏ సాయం కావాలన్నా చేస్తానని ఈ సందర్భంగా చంద్రబాబు ఆమెకు హామీ ఇచ్చారు. బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలంటూ ఎంపీసీ టాపర్ షర్మిలను చంద్రబాబు ఆశీర్వదించారు. కాగా, సోమవారం ఇంటర్ టాపర్స్ తో సీఎం ప్రత్యక్షంగా కలిసి మాట్లాడనున్నారు.