: లిబియా వలసదారులు వెళుతున్న పడవ మునక.. 97 మంది గల్లంతు


సముద్రంలో పడవ మునిగిపోవడంతో 97 మంది వలసదారులు గల్లంతైన ఘటన లిబియా రాజధాని ట్రిపోలి సమీపంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదం జరిగిన స‌మ‌యంలో ఆ ప‌డ‌వ‌లో మొత్తం 120 మంది శ‌ర‌ణార్థులు ఉండ‌గా.. వారిలో 23 మందిని లిబియా కోస్ట్ గార్డ్ సిబ్బంది కాపాడారు. గ‌ల్లంతైన వారి జాడ ఇంకా తెలియ‌లేదు. ఈ ఘ‌ట‌న‌పై పూర్తి వివ‌రాలు అందాల్సి ఉంది. గ‌త మూడేళ్ల‌లో లిబియా నుంచి ల‌క్షా 50 మంది శ‌ర‌ణార్థులు వెళ్లారు. వారంతా ఒక్క‌సారిగా ప‌డ‌వ‌లు ఎక్కి, ప‌డ‌వ‌ సామ‌ర్థ్యానికి మంచి ప్ర‌యాణిస్తుండ‌డంతో ఇటువంటి ప్ర‌మాదాలు అధికంగా జ‌రుగుతున్నాయి.

  • Loading...

More Telugu News