: హరీష్ రావు ముఖ్యమంత్రి కావడం ఖాయం: సర్వే సత్యనారాయణ
ఏదో ఓ రోజు హరీష్ రావు ముఖ్యమంత్రి కావడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సర్వే సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. మెదక్ జిల్లా రామాయం పేట మండలంలోని ప్రగతి ధర్మారంలో కాంగ్రెస్ పార్టీ ఈ రోజు చేపట్టిన పాదయాత్ర కార్యక్రమాన్నిఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో నియంత పాలన కొనసాగుతోందని, అవినీతికి పాల్పడుతున్న కేసీఆర్ కుటుంబం, హరీష్ రావును ఒంటరిని చేశారని ఆరోపించారు. మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్ల అమలు సాధ్యం కాకపోయినప్పటికీ కేసీఆర్ తప్పుడు హామీలతో మోసగిస్తున్నారని మండిపడ్డారు. ఎస్పీ వర్గీకరణను పథకం ప్రకారమే కేసీఆర్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని సర్వే ధీమా వ్యక్తం చేశారు.