: ‘అందరూ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇదిగో’ అంటున్న క్రికెట్ దేవుడు.. ‘సచిన్‌’ ట్రైలర్‌ విడుదల


క్రికెట్ దేవుడిగా అభిమానులు పిలుచుకునే సచిన్ టెండూల్కర్‌ జీవితం ఆధారంగా జేమ్స్‌ ఎర్స్‌కైన్ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘సచిన్‌: ఎ బిలియన్‌ డ్రీమ్స్‌’ ట్రైలర్‌ను ఆ చిత్ర నిర్మాణ సంస్థ కార్నివల్‌ మోషన్‌ పిక్చర్స్ విడుద‌ల చేసింది. ఈ సినిమాకి ఏ.ఆర్. రెహ‌మాన్ సంగీతం అందిస్తున్నాడు. స‌చిన్ చిన్న‌నాటి సంగ‌తులు, ఆయ‌న‌ క్రికెట్‌ను ఆరాధించిన తీరు, మైదానంలో త‌న‌దైన శైలిలో ప్ర‌ద‌ర్శించిన ఆట‌తీరును ఈ ట్రైల‌ర్‌లో చూపించారు. ఈ సంద‌ర్భంగా స‌చిన్ త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా స్పందిస్తూ.. త‌న‌ను అందరూ అడిగిన ప్రశ్నకు 'సమాధానం ఇదిగో' అని పేర్కొన్నాడు. మే 26న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోందని తెలిపాడు.


  • Loading...

More Telugu News