: పాము దెబ్బకు పడుతూ లేస్తూ పరుగులు పెట్టాడు!


పాముని చూస్తేనే భయంతో వణికిపోతాం. అలాంటిది అది కాళ్లకు చుట్టేసుకుంటే.. ఇంకేమైనా ఉందా? ఇక్కడ అదే జరిగింది. ఈ సంఘటన థాయ్ లాండ్ లోని ఓ ఇంటర్ నెట్ కేఫ్ లో జరిగింది. ఇంటర్ నెట్ కేఫ్ లో ఓ యువకుడు తన పని కాగానే, బయటకు వెళ్లేందుకు డోర్ వద్దకు వెళుతున్నాడు. లోపల ఉన్న మరో వ్యక్తితో మాట్లాడుతూ డోర్ కొద్దిగా తెరిచాడు. అంతే, ఉన్నపళంగా ఓ పాము అతనిపైకి దూకింది.

ఈ ఊహించని సంఘటనతో భయభ్రాంతులకు గురైన సదరు యువకుడు కేఫ్ లోకి పరుగులు పెట్టాడు. ఆ పాము అతని కాళ్లకు చుట్టుకోవడంతో మరింత భయపడిపోయిన ఆ యువకుడు, కింద పడి గింగిరాలు తిరిగాడు. కేఫ్ లో ఉన్న మిగిలిన వ్యక్తులు పరుగులు తీశారు. ఈ సంఘటన కేఫ్ లోని సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఈ వీడియో యూ ట్యూబ్ కు చేరడంతో వైరల్ మారింది. అయితే, ఆ పాము నుంచి అతనికి ఎటువంటి ప్రమాదం వాటిల్లలేదు.

  • Loading...

More Telugu News