: తాము పెంచిన ఆ బాలిక కోసం ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్న కోతులు
ఉత్తరప్రదేశ్ లోని ఓ అటవీ ప్రాంతంలో ఓ బాలిక (11) కోతులతో ఆడుకుంటూ కనిపించడంతో ఆమెను చూసిన పోలీసులు ఆసుపత్రిలో చేర్చిన విషయం తెలిసిందే. ఆమె ఇన్నాళ్లూ కోతులతోనే అడవిలో పెరిగిందని ఆసుపత్రిలోనూ ఆమె కోతిలా ప్రవర్తిస్తోందని వైద్యులు కూడా చెప్పారు. అయితే, ఇన్నాళ్లూ తాము పెంచిన ఆ బాలిక ఇప్పుడు తమ వద్ద లేకపోవడంతో కోతులు ఆసుపత్రి చుట్టూ చేరుతున్నాయి. తమతో చిన్ననాటి నుంచి ఆడుకున్న తమ ఫ్రెండ్ అయిన ఆ బాలిక మళ్లీ తమ దగ్గరకు వస్తుందని ఎదురుచూస్తున్నాయి. ఆమెను చిన్నప్పటి నుంచి పెంచిన కోతులంతా ఆసుపత్రి చుట్టూ తిరుగుతుండడంతో అక్కడి వారిని ఆ దృశ్యం కదిలిస్తోంది. ప్రస్తుతం ఆ చిన్నారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.