: గూగుల్ నుంచి మరో సరికొత్త యాప్
టెక్ దిగ్గజం గూగుల్ నుంచి మరో సరికొత్త యాప్ విడుదలైంది. ‘ఏరియో’ పేరుతో విడుదల చేసిన ఈ యాప్ ద్వారా తమ యూజర్లకు ఎన్నో సదుపాయాలు అందిస్తోంది. ఈ యాప్ ద్వారా హోటళ్లు, రెస్టారెంట్ల నుంచి ఆహార పదార్థాలను ఆర్డర్ చేయడం, బిల్లుల చెల్లింపులు, ప్లంబర్, బ్యుటీషియన్ వంటి సేవలను పొందవచ్చు. అన్ని సర్వీస్‌లు ఏరియా యాప్‌లో ఒకే చోట ఉండడంతో యూజర్లకు మరింత సౌలభ్యం కలుగుతుంది. ప్రస్తుతానికి ఈ యాప్ ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో పనిచేస్తోంది. ఆ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని వినియోగదారులు ఎక్కడ ఉన్నారో ఆ లోకేషన్‌ను గుర్తించిన అనంతరం ఆ అడ్రస్ సేవ్ చేసుకోవాలి. దీంతో యూజర్లు ఆర్డరు చేసుకున్న వెంటనే వారు కోరుకున్న వస్తువులు, ఆహార పదార్థాల డెలివరీ వచ్చేస్తుంది.