: క్రికెటర్ల జీతభత్యాల అంశంలో రవిశాస్త్రి జోక్యాన్ని తప్పుబట్టిన బీసీసీఐ


క్రికెటర్ల జీతాభత్యాల పెంపుపై భారత క్రికెట్ జట్టు మాజీ డైరెక్టర్ రవిశాస్త్రి జోక్యాన్ని బీసీసీఐ తప్పుబట్టింది. ఈ విషయంలో తమకు ఎవరి సలహాలు అవసరం లేదని బీసీసీఐ పరిపాలనా కమిటీ సీఈఓ వినోద్ రాయ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆటగాళ్ల వార్షిక వేతనాల విషయంలో తాము చాలా స్పష్టంగా ఉన్నామని, ఈ విషయమై భారత ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే తమకు ఓ నివేదిక అందజేశారని, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో ఇప్పటికే సమావేశమయ్యామని చెప్పారు.

క్రికెటర్ల వేతనాల పెంపునకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు తలెత్తితే కనుక త్వరలోనే పరిష్కరిస్తామని, ఆటగాళ్లకు, బీసీసీఐకి మధ్యవర్తిత్వం అవసరం లేదని వినోద్ రాయ్ తేల్చి చెప్పారు. కాగా, ‘ఏ’ గ్రేడ్ ఆటగాళ్ల వార్షిక వేతనం కోటి రూపాయల నుంచి రెండు కోట్లకు బీసీసీఐ పెంచింది. అయితే, ఆటగాళ్ల వేతనం రెట్టింపు చేసిన తర్వాత కొన్ని రోజుల క్రితం రవిశాస్త్రి స్పందించాడు. వారి వేతనం మరింత పెంచాలని సూచించాడు.

  • Loading...

More Telugu News