: పాక్ మహిళా స్టెవార్డ్ తో అసభ్య ప్రవర్తన.. పోలీసుల అదుపులో ఐదుగురు ప్రయాణికులు!


పాకిస్థాన్ మహిళా స్టెవార్డుతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ విమాన ప్రయాణికుడిని యూకే పోలీసులు అరెస్టు చేశారు. పాకిస్థాన్ కు చెందిన పీకే-791 విమానం ఇస్లామాబాద్ నుంచి బర్మింగ్ హోమ్ వెళుతోంది. పాక్ జాతీయులైన ఐదుగురు బ్రిటన్ వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. ఇందులో ఇద్దరు ముగ్గురు వ్యక్తులు బాత్రూమ్ లో సిగిరెట్లు కాల్చుతున్నట్లు కేబిన్ సిబ్బంది గమనించారు. విమానంలో సిగిరెట్ తాగడం నిబంధనలకు విరుద్ధం. ఈ విషయమై మహిళా స్టెవార్డ్ వారిని అడిగింది. ఆమె పట్ల వారు అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా, అసభ్యంగా మాట్లాడారు. ఈ విషయాన్ని ఆమె పైలట్ కు చెప్పింది. బర్మింగ్ హామ్ లో విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో పైలట్ ఈ విషయమై పోలీసులను అప్రమత్తం చేయడం జరిగింది. మహిళా స్టెవార్డ్ ను ఇబ్బంది పెట్టిన సదరు ప్రయాణికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News