: కుల్ భూషణ్ ఇప్పుడు ఎలా ఉన్నారో వివరాలు తెలియవు: కేంద్ర ప్రభుత్వం


భారత నౌకాదళ మాజీ అధికారి కుల్ భూషణ్ కి పాకిస్థాన్‌లో మ‌ర‌ణ‌శిక్ష విధించ‌డంపై భార‌త్‌లో నిర‌స‌న‌లు వ్య‌క్తం అవుతున్న విష‌యం తెలిసిందే. అయితే, ఆయ‌న పాక్‌లో ఎక్క‌డ ఉన్నార‌నే విష‌యం గురించిన వివ‌రాలేమీ తెలియ‌ద‌ని భారత ప్రభుత్వం పేర్కొంది. ఆయన ఏ పరిస్థితిలో ఉన్నారో కూడా తెలియ‌ద‌ని చెప్పింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గోపాల్‌ బాగ్లే ఈ విష‌యంపై మాట్లాడుతూ... గూఢచర్యం, విద్రోహ కార్యకలాపాలకు పాల్పడ్డాడనే ఆరోపణలతో ఆయ‌న‌ను అరెస్టు చేశార‌ని చెప్పారు. జాదవ్‌ అపహరణకు గురైన అమాయకుడు అని అయ‌న పేర్కొన్నారు. ఆయ‌న‌ మాజీ నేవీ అధికారి అని ఎంతోకాలంగా పాక్‌కు చెబుతున్నామ‌ని గోపాల్ తెలిపారు.

  • Loading...

More Telugu News