: రాజకీయాలకు దూరంగా ఉండండి: చర్చ్ లకు సూచించిన వెంకయ్య
చర్చిలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను మాత్రమే నిర్వర్తించాలని.. రాజకీయాలకు దూరంగా ఉండాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. కేరళలోని తిరువనంతపురంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కేరళలో బీజేపీ బలోపేతం కావడానికి చర్చిలు ఆటంకంగా మారాయా? అనే ప్రశ్నకు బదులుగా ఆయన పై సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న పడవ అని... అందులో తెలివైన వారు ఎవరూ ఉండరని అన్నారు. కాంగ్రెస్ నేతలను లాగే ప్రయత్నాలను తాము చేయడం లేదని చెప్పారు.