: కుల్‌భూషణ్‌ జాదవ్‌కు మరణశిక్షపై సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్‌ ట్వీట్


భార‌త నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌పై గూఢచర్యం ఆరోపణలు మోపుతూ, ఎటువంటి ఆధారాలు లేకుండానే ఆయ‌న‌కు పాకిస్థాన్ ఆర్మీ కోర్టు ఉరిశిక్ష విధించ‌డం ప‌ట్ల సల్మాన్‌ ఖాన్‌ తండ్రి, రచయిత సలీం ఖాన్ స్పందిస్తూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఓ నిర్దోషిని చంపడమంటే మానవత్వాన్ని చంపడమేనని వ్యాఖ్యానించారు. భారత్‌ ఎప్పుడూ పాకిస్థాన్‌తో సత్సంబంధాలే కోరుకుంటుంద‌ని త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పేర్కొన్నారు. కుల్‌భూష‌ణ్‌ జాదవ్‌ క్షేమంగా భారత్‌కు రావాల‌ని ఆశిద్దామని అన్నారు. కుల్‌భూష‌ణ్‌కు ఉరిశిక్ష విధించ‌డం ప‌ట్ల యావ‌త్ భారత్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న విష‌యం తెలిసిందే.


  • Loading...

More Telugu News