: హిమాచల్ ప్రదేశ్ సీఎంకు మరోసారి ఈడీ సమన్లు
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కు చిక్కులు తప్పేలా లేవు. మనీలాండరింగ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆయనకు మరోసారి సమన్లు జారీ చేసింది. ఇంతకు ముందు సమన్లు జారీ చేసినప్పటికీ వీరభద్ర సింగ్ వెళ్లలేదు. దీంతో, మరోసారి, సమన్లు జారీ చేసింది. ఆదాయానికి మించిన కేసును ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఆయనకు చెందిన ఓ ఫామ్ హౌస్ ను ఈడీ అటాచ్ చేసింది. దీని విలువ రూ. 27 కోట్లు. 2015లో సీబీఐ ఫిర్యాదు మేరకు ఆయనపై మనీలాండరింగ్ కేసును ఈడీ నమోదు చేసింది.