: ఈ కోతి మామూలు కోతి కాదు... టెన్నిస్ ఆడుతూ అదరగొడుతోంది!
ఓ కోతి టెన్నిస్ రాకెట్ చేతబట్టి ఓ ప్లేయర్‌లా కోర్టులో అదరగొడుతోంది. టెన్నిస్ క్రీడాకారుల్లా షర్ట్, షార్ట్ వేసుకుని ప్రతి రోజూ కోర్టులో సాధన చేస్తూ అందరినీ అలరిస్తోంది. ఆ కోతి పేరు రిక్కీ. జపాన్‌లో తన యజమానితో టెన్నిస్ ప్రాక్టీస్ చేస్తూ ఎంజాయ్ చేస్తోంది. తనతో ఆడుతున్న తోటి ఆటగాడిని మెచ్చుకుంటూ, చప్పట్లు కొడుతూ అచ్చం ఓ అంతర్జాతీయ టెన్నిస్ ప్లేయర్ లా ప్రవర్తిస్తోంది. ఆ కోతి పేరిట ఓ యూట్యూబ్ చానెల్ ఉంది. కోర్టును, దాని ఆట తీరును తెలిపే వీడియోలను అందులో పోస్ట్ చేస్తున్నారు. టెన్నిస్ ప్లేయర్‌లా ఆ కోతి ఆడుతున్న ఆటను చూస్తున్న నెటిజన్లు శభాష్ రిక్కీ అంటూ మెచ్చుకుంటున్నారు. ఈ వీడియోను మీరూ చూడండి...