: చిరంజీవి, రామ్ చరణ్, విజయ్ లంటే ఇష్టం.. సూర్య, కార్తీలు నా స్కూల్ మేట్స్: మహేష్ బాబు
సూపర్ స్టార్ మహేష్ బాబు తన తాజా చిత్రం 'స్పైడర్' సినిమాతో తమిళనాడులోనూ అడుగుపెట్టబోతున్నాడు. తమిళంలో కూడా ఈ సినిమా భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా, ఓ తమిళ పత్రికకు మహేష్ బాబు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చాడు. టాలీవుడ్ లో చిరంజీవి, రామ్ చరణ్ లు తనకు చాలా క్లోజ్ అని చెప్పాడు. కోలీవుడ్ లో విజయ్ మంచి మిత్రుడని తెలిపాడు. ఇద్దరం కలసి మణిరత్నం సినిమాలో నటించాలనుకున్నా అది కుదరలేదని చెప్పాడు. 25 ఏళ్ల పాటు చెన్నైలోనే పెరిగానని... తెలుగుతోపాటు తమిళం కూడా చాలా బాగా మాట్లాడతానని తెలిపాడు. హీరోలు సూర్య, కార్తీలు తనకు స్కూల్ మేట్స్ అని చెప్పాడు. రాజకీయాల గురించి తనకు ఏమీ తెలియదని... రాజకీయాల్లోకి రావాలో, వద్దో కూడా తనకు తెలియదని అన్నాడు.