: ఫోన్‌లో భార్యకు తలాక్‌ చెప్పాడు.. మరో బాలికతో పారిపోయాడు!


దేశంలో తలాక్ కేసులు పెరిగిపోతున్నాయి. మూడు సార్లు తలాక్ చెప్పి భార్యను వదిలేసి వేరే వారిని పెళ్లి చేసుకునే పద్ధతితో ముస్లిం మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతూ న్యాయం కోసం కోర్టులు, పోలీస్ స్టేషన్ల మెట్లు ఎక్కుతున్నారు. తాజాగా ఇటువంటి ఘ‌ట‌నే మ‌రొక‌టి మ‌ధ్యప్ర‌దేశ్ రాజ‌ధాని భోపాల్‌లో చోటు చేసుకుంది. అయితే, భార్య‌కు త‌లాక్ చెప్పిన ఆ వ్య‌క్తి 14 ఏళ్ల బాలిక అయిన త‌న భార్య‌ మేన‌కోడ‌లిలో క‌లిసి పారిపోవ‌డం గ‌మ‌నార్హం. ఆ మైనర్ బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు స‌ద‌రు నిందితుడిని అరెస్ట్ చేశారు.

ఫైజాన్ అనే యువకుడు ఓ అమ్మాయిని ప్రేమించి పెద్దల అనుమతితో పెళ్లి చేసుకున్నాడు. అయితే అనంత‌రం భార్య మేనకోడలి (14)తో సంబంధం పెట్టుకుని ఆమెతో కలసి కాన్పూర్ పారిపోయాడు. కాన్పూర్‌లో పెట్రోలింగ్ చేస్తున్న రైల్వే పోలీసులకు ఫైజాన్‌, బాలిక‌ అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకుని వారిద్దరినీ భోపాల్ పంపించారు. త‌న‌ను కాన్పూర్ తీసుకెళ్లాక ఫోన్‌లో విడాకులు ఇస్తున్నట్టు ఫైజర్ భార్యకు చెప్పాడని, త‌న‌ను పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పాడ‌ని ఆ మైనర్ బాలిక తెలిపింది. ఆ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. 

  • Loading...

More Telugu News