: శశికళ బంధువు దినకరన్ కు ఆర్థిక నేరాల కోర్టు నోటీసులు


శశికళ బంధువు, ఆర్కే నగర్ ఉపఎన్నికలో అన్నాడీఎంకే పార్టీ అభ్యర్థి దినకరన్ కు చెన్నైలోని ఆర్థిక నేరాల కోర్టు సమన్లు జారీ చేసింది. ఫెరా నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ నెల 18, 19 తేదీల్లో కోర్టుకు హాజరు కావాలంటూ జడ్జి ఆదేశించారు. ఫెరా నిబంధనలను దినకరన్ ఉల్లంఘించినట్టు ఈడీ అభియోగాలను నమోదు చేసింది. 1994 నుంచి ఈ కేసు దినకరన్ ను వెంటాడుతోంది. ఈ కేసుకు సంబంధించి కింది కోర్టులో దినకరన్ కు ఊరట లభించినప్పటికీ... ఈడీ హైకోర్టుకు వెళ్లింది. దీంతో, ఆయన మళ్లీ విచారణ ఎదుర్కొంటున్నారు. శశికళతో పాటు దినకరన్ విదేశీ బ్యాంకులకు భారీ ఎత్తున నిధులను తరలించినట్టు ఆరోపణలు వచ్చాయి. అయితే, తాము ఎలాంటి తప్పు చేయలేదని, తమ ప్రత్యర్థులే కావాలని తమపై ఇలాంటి అభియోగాలు మోపుతున్నారని... అంతా కోర్టులోనే తేల్చుకుంటామని చెప్పారు. 

  • Loading...

More Telugu News