: రైతుల్ని ఎందుకు పట్టించుకోవడం లేదు?: అన్నా డీఎంకే ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం


రైతుల ఆందోళనలను ఎందుకు పట్టించుకోవడం లేదంటూ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రైతుల దుస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం మౌనం వహించడం సరికాదని... మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించింది. తమిళనాడులో రైతుల ఆత్మహత్యలపై పూర్తి స్థాయి నివేదిక అందించాలని ఆదేశించింది. దాదాపు నెల రోజుల నుంచి కరవు ఉపశమన ప్యాకేజీని ఇవ్వాలని, రైతు రుణాలను మాఫీ చేయాలని తమిళనాడు రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలో సైతం వారు వినూత్న రీతుల్లో ఆందోళన చేపడుతున్నారు. నిరసన వ్యక్తం చేస్తున్నారు. 

  • Loading...

More Telugu News