: విడాకుల వివాదంపై ఇప్పటికి నోరు విప్పిన మలయాళ హీరో!
మలయాళ నటుడు దిలీప్ తన మాజీ భార్య మంజు వారియర్ నుంచి విడాకులు తీసుకోవడంపై వివాదం నడిచిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్టికి తన రెండో వివాహంపై దిలీప్ స్పందించాడు. మంజు వారియన్ తో విడాకులకు, ప్రస్తుత తన భార్య కావ్యకు సంబంధం లేదని అన్నాడు. తాను చాలా మందిని నమ్మి, మోసపోయానని చెప్పాడు. అలా మోసపోయిన ప్రతిసారి మౌనంగా ఉండేవాడినని, అందుకు కారణం తన కుమార్తె భవిష్యత్తు గురించిన ఆలోచనలేనని (తన మాజీ భార్య కూతురు) తెలిపాడు.
ఇప్పుడు తన మాజీ భార్య తన జీవితాన్ని సాగిస్తోందని, అదేవిధంగా తాను కూడా తన జీవితం సాగిస్తున్నానని, తామిద్దరం ఎవరి దారుల్లో వారు ప్రయాణిస్తున్నామని దిలీప్ తెలిపాడు. తమ బంధం ముగిసిపోయిన కథ అని దిలీప్ పేర్కొన్నాడు. 1998లో జరిగిన తమ వివాహం ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయమని తెలిపాడు. 2014లో ఆమెకు విడాకులు ఇచ్చిన దిలీప్ 2015లో మరో నటి కావ్యను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.