: తిరుమలలో రాజకీయాలు మాట్లాడటం ఏమిటి?: రోజాపై అనిత ఫైర్
వైసీపీ ఎమ్మెల్యే రోజా ఈ ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం అక్కడున్న మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో రోజాపై టీడీపీ ఎమ్మెల్యే అనిత నిప్పులు చెరిగారు. పవిత్రమైన తిరుమల ఆలయ ప్రాంగణంలో రాజకీయాల గురించి మాట్లాడటమేంటని ఆమె ప్రశ్నించారు. రాజకీయాలకు తిరుమల వేదికగా మారకూడదని అన్నారు. రోజా వ్యవహరిస్తున్న తీరు దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రోజా తన తీరును మార్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.