: అమ్మాయిలే టాప్... ఏపీ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు విడుదల!


ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి గంటా శ్రీనివాస్ ఇంటర్ ఫలితాలను కొద్దిసేపటి క్రితం విజయవాడలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత సంవత్సరం నుంచి తొలి, రెండో సంవత్సరం ఫలితాలను ఒకేసారి విడుదల చేస్తున్నామని, ఈ దఫా రికార్డు సమయంలో ఆన్సర్ షీట్ల గణనను పూర్తి చేశామని తెలిపారు.

కాగా, ఎప్పటిలానే ఫలితాల్లో బాలికలదే పైచేయి అయింది. ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో 80 శాతం బాలికలు, 75 శాతం బాలురు ఉత్తీర్ణులయ్యారు. రెండో సంవత్సరం ఫలితాల్లో 69 శాతం మంది బాలికలు, 60 శాతం మంది బాలురు ఉత్తీర్ణత సాధించారు. ఫస్టియర్ ఫలితాల్లో 77 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా తొలి స్థానంలో నిలువగా, నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాలు రెండు, మూడు స్థానాల్లో, కడప ఆఖరి స్థానంలో నిలిచింది. సెకండియర్ ఫలితాల్లో 86 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా నిలువగా, నెల్లూరు, గుంటూరు జిల్లాలు రెండు, మూడు స్థానాల్లో, కడప ఆఖరి స్థానంలో నిలిచింది.

  • Loading...

More Telugu News