: చెల్లెలైతే మాత్రం చేసింది తప్పు కాకుండా పోతుందా?: సోనమ్ కపూర్ కు సమాధానం చెప్పిన అభయ్ డియోల్


సౌందర్య సాధనాలు, ప్రధానంగా ఫెయిర్ నెస్ క్రీముల్లో నటించే నటులపై బాలీవుడ్ నటుడు అభయ్ డియోల్ చేసిన ట్వీట్లు వివాదంగా మారాయి. స్టైలిష్ ఐకాన్ గా పేరుతెచ్చుకున్న సోనమ్ కపూర్ ఈ ట్వీట్లపై స్పందించింది. ఇషా డియోల్ నటించిన ఒక ఫెయిర్ నెస్ క్రీమ్ కు సంబంధించిన యాడ్ ను అతనికి ట్వీట్ చేసిన సోనమ్... 'నీ ఆలోచనా విధానం నచ్చింది... మరి దీనిపై నీ వివరణ ఏంటి?' అని అడిగింది.

దీనికి స్పందించిన అభయ్ డియోల్.. 'తన చెల్లెలు చేసినంత మాత్రాన ఆ ప్రకటన ఒప్పవదని, ఆమె కూడా ఆ ప్రకటనలో నటించి తప్పు చేసింద'ని స్పష్టంగా పేర్కొన్నాడు. దీంతో సోనమ్ షాక్ తింది. మరోపక్క సోనం ఇలా అడగడాన్ని అభియ్ డియోల్ స్పోర్టివ్ గా తీసుకున్నప్పటికీ, అతని అభిమానులు మాత్రం అలా తీసుకోలేదు. అభయ్ చేసిన వాదనలో వాస్తవం ఉందని, అతని గురించి అడగడం మానేసి, మధ్యలో అతని చెల్లెల్ని ఎందుకు లాగుతున్నావంటూ పలువురు సోనమ్ కపూర్ ను నిలదీశారు. దీంతో పలాయనం చిత్తగించిన సోనమ్ కపూర్ తన ట్వీట్లను డిలీట్ చేసేసింది. బాలీవుడ్ లో విభిన్న పాత్రలు పోషించడం ద్వారా రియలిస్టిక్ హీరోగా అభయ్ డియోల్ పాప్యులారిటీ సంపాదించుకున్నాడు. 

  • Loading...

More Telugu News