: బీఎస్పీ, ఆప్, కాంగ్రెస్ సీట్లలో పాగా వేసిన బీజేపీ!


పలు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 10 అసెంబ్లీలకు ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఆరింట విజయం దిశగా దూసుకెళుతోంది. గతంలో బహుజన్ సమాజ్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ ఖాతాల్లో ఉన్న స్థానాలను బీజేపీ కైవసం చేసుకోనుంది. రాజస్థాన్ లోని ధోల్ పూర్ నియోజకవర్గంలో బీఎస్పీ సిట్టింగ్ స్థానాన్ని బీజేపీ అభ్యర్థి శోభా రాణి కుశ్వాహ, ఢిల్లీలో ఆప్ సిట్టింగ్ స్థానమైన రాజౌరీ గార్డెన్ అసెంబ్లీని బీజేపీకి చెందిన మణీందర్ సింగ్ సిర్సా గెలుచుకున్నారు. మధ్యప్రదేశ్ లోని కాంగ్రెస్ స్థానం అతర్ కు జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీకి చెందిన అరవింద్ సింగ్ భడోరియా గెలుపు దిశగా దూసుకెళుతున్నారు. మిగతా అసెంబ్లీల్లో మాత్రం ఏ పార్టీ సిట్టింగ్ స్థానం ఆపార్టీకే దక్కేలా కనిపిస్తోంది.

  • Loading...

More Telugu News