: పాక్ ఖైదీల్లో భయం భయం!


పాకిస్తాన్ లో భారతీయ ఖైదీ సరబ్ జిత్ మృతి చెందడంతో భారత్ లోని వివిధ జైళ్ళలో ఖైదీలుగా ఉన్న పాక్ జాతీయుల్లో భయం తొంగిచూస్తోంది! వీరి భద్రత ఇప్పుడు జైళ్ళ శాఖ అధికారులకు సవాల్ గా మారింది. నిన్న ఔరంగాబాద్, నాసిక్ కారాగారాల వద్ద భద్రత పెంచిన సంగతి తెలిసిందే. కాగా, 20 మందికిపైగా పాక్ ఖైదీలు శిక్ష అనుభవిస్తోన్న తీహార్ జైలు వద్ద నేడు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. పాక్ ఖైదీలపై ఎలాంటి దాడులు జరగకుండా నిరోధించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో తీహార్ జైల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News