: కిమ్ జాంగ్ ఉన్ ను చంపేందుకు... లాడెన్ ను మట్టుబెట్టిన 'సీల్ టీమ్-6'ను పంపిన ట్రంప్?


కిమ్ జాంగ్ ఉన్ ను పథకం ప్రకారం హతమార్చేందుకు అమెరికా అధ్యక్షుడు పావులు కదుపుతున్నారని ఉత్తర కొరియా మీడియా ఆరోపిస్తోంది. కిమ్ జాంగ్ ఉన్ ను హతమార్చడమే లక్ష్యంగా, గతంలో కరుడుగట్టిన ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ ను మట్టుబెట్టిన సీల్ టీమ్ ను దక్షిణ కొరియాకు అమెరికా రహస్యంగా పంపిందని ఉత్తర కొరియా మీడియా చెబుతోంది. కిమ్ జాంగ్ ఉన్ ను మట్టుబెట్టడం ద్వారా లిబియాను ఆక్రమించుకున్నట్టుగా తమ దేశాన్ని ట్రంప్ ఆక్రమించుకోవాలని చూస్తున్నారని ఉత్తర కొరియా మీడియా ఆరోపిస్తోంది. దక్షిణ కొరియాకు ట్రంప్ పంపిన సైన్యాన్నే అందుకు సాక్ష్యంగా చూపుతోంది. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 17 వేల సైనిక దళాలను పంపడమే కాకుండా, బిన్‌ లాడెన్‌ ను మట్టుబెట్టిన స్పెషల్ టీమ్‌ ను దక్షిణ కొరియా సరిహద్దుల్లోకి చేర్చడం వెనుక కారణం అదేనని ఉత్తర కొరియా మీడియా ప్రత్యేక కథనం ప్రచురించింది.

 దీనిని అమెరికా నేవీ కమాండర్ గేరీ రోజ్ తోసిపుచ్చారు. మిలటరీ డ్రిల్ కోసమే తాము ఈ సైన్యాన్ని దక్షిణ కొరియాకు తరలించామని తెలిపారు. వివిధ రకాల సైనిక విన్యాసాలు చేయాల్సి ఉండడంతో అంత సైన్యం వస్తోందని తెలిపారు. ఇదిలా ఉంచితే, ఉత్తరకొరియాను అదుపులో పెట్టేందుకు దక్షిణ కొరియాకు అత్యంత శక్తిమంతమైన మిలటరీని పంపుతున్నామని ఇటీవల ట్రంప్ ప్రకటించారు. అంతే కాకుండా ఉత్తర కొరియాను అదుపులో పెట్టేందుకు చైనాతో దోస్తీ చేస్తున్నామని, చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ తో తన కెమెస్ట్రీ కుదిరిందని ట్రంప్ పేర్కొన్న సంగతి కూడా తెలిసిందే. 

  • Loading...

More Telugu News