: బాగా ఫైట్ చేస్తున్నారు... వైకాపా ఎంపీలపై పవన్ కల్యాణ్ పొగడ్తలు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించాలన్న ఆకాంక్షతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు బాగా పోరాడుతున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించిన ఆయన, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అంటూ విజయసాయి రెడ్డి పార్లమెంటులో డిమాండ్ చేసిన వార్తకు సంబంధించిన క్లిప్పింగ్ ను పోస్టు చేశారు. కేంద్రంపై వైఎస్ఆర్ సీపీ ఎంపీలు గట్టి ఒత్తిడి తెస్తున్నారని కితాబిచ్చారు. ఎంతో మంది డిమాండ్ చేస్తున్నప్పటికీ, ఉత్తరప్రదేశ్ ను ఎందుకు విభజించలేదని ప్రశ్నించిన ఆయన, రాష్ట్రాల విభజన కేవలం దక్షిణాదిలోని ఏపీకి మాత్రమే ఎందుకు పరిమితం చేశారని మండిపడ్డారు. తెలంగాణ ఎంపీ కేశవరావు సైతం ఏపీకి హోదాకోసం మాట్లాడటంపై కృతజ్ఞతలు తెలిపారు.

  • Loading...

More Telugu News